Page Loader
Nidhi Agarwal: హీరోయిన్ నిధి అగర్వాల్‌కు వేధింపులు.. కేసు నమోదు
హీరోయిన్ నిధి అగర్వాల్‌కు వేధింపులు.. కేసు నమోదు

Nidhi Agarwal: హీరోయిన్ నిధి అగర్వాల్‌కు వేధింపులు.. కేసు నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2025
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓవైపు హనీ రోజ్ వివాదం కొనసాగుతూనే ఉంది. ఆమె వేసిన కేసు ఆధారంగా, సంబంధిత వ్యాపారవేత్తతో పాటు పలు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ వివాదం కొనసాగుతున్న వేళ, నిధి అగర్వాల్ కూడా సైబర్ క్రైమ్ కేసులో ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులుగా ఓ వ్యక్తి నిధి అగర్వాల్‌ను సోషల్ మీడియా ద్వారా వేధిస్తున్నాడు. మొదట్లో ఇది సాధారణ టీజింగ్ అనుకుని, నిధి అగర్వాల్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ వ్యక్తి రేప్ చేస్తానని , హత్య చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత, నిధి అగర్వాల్ కుటుంబ సభ్యుల్ని కూడా బెదిరించడం ప్రారంభించాడు.

వివరాలు 

ప్రస్తుతం,నిధి అగర్వాల్ రెండు భారీ సినిమాలతో బిజీ

ఈ నేపథ్యంలో,నిధి అగర్వాల్ పోలీసులని ఆశ్రయించి,తనకు ఎదురవుతున్న బెదిరింపులతో సంబంధించి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుకు,బెదిరింపులను వివరించే స్క్రీన్‌షాట్స్ కూడా జోడించింది.పోలీసులు కేసును విచారిస్తున్నారు. ప్రస్తుతం నిధి అగర్వాల్ రెండు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి ఆమెను మానసికంగా వేధిస్తుండటం,అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో కోరింది. ఈ ఏడాది నిధి అగర్వాల్ కెరీర్‌కు అత్యంత కీలకమైనది.పవన్ కల్యాణ్‌తో కలిసి ఆమె నటించిన "హరిహర వీరమల్లు" సినిమా, ప్రభాస్‌తో కలిసి చేస్తున్న "రాజాసాబ్" సినిమా త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ రెండు సినిమాల ద్వారా ఆమె కెరీర్ పీక్‌ స్టేజ్‌కు చేరుకుంటుందని ఆమె ఆశపడుతున్నారు. ప్రస్తుతం, ఇనస్టాగ్రామ్‌లో ఆమెకు 30 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.