
మామా వియత్నాంలో షో వేయించు: ట్విట్టర్ వేదికగా నవీన్ పొలిశెట్టి, నిఖిల్ సంభాషణ వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.
స్పెర్మ్ డొనేషన్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం, మంచి కామెడీని పంచడంతో పాటు మంచి ఫీల్ గుడ్ అనుభూతిని కూడా ఇచ్చింది.
ఈ సినిమాపై ఇప్పటికే రాజమౌళి ప్రశంసలు కురిపించారు. తాజాగా హీరో నిఖిల్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా స్పెషల్ షో వేయించమని ట్విట్టర్ వేదికగా నవీన్ పొలిశెట్టిని అడిగారు.
అవును, కానీ ఇండియాలో కాదు, వియత్నాంలో. మామా... నేను వియత్నాంలో ఉన్నాను, సినిమా విజయం సాధించినందుకు కంగ్రాట్స్.. వియత్నాంలో స్పెషల్ షో వేయించు కదా అని నిఖిల్ అడిగారు.
Details
అడ్రెస్ పెట్టమన్న నవీన్ పొలిశెట్టి
నిఖిల్ అడగంతోనే వియత్నాంలో ఎక్కడా, అడ్రెస్ పెట్టు అని స్పందించారు నవీన్ పొలిశెట్టి. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
అలాగే ఇండియాకి ఎప్పుడు వస్తున్నావని, సినిమా మీద నీ రివ్యూ వినాలనుందనీ అంటూ నవీన్ పోలిశెట్టి రిప్లై ఇచ్చారు.
స్వయంభు సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్, యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి హీరో నిఖిల్ వియత్నాం వెళ్లారు.
అదలా ఉంచితే, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను మహేష్ బాబు పి డైరెక్ట్ చేసారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాలో జయసుధ, మురళీ శర్మ, తులసి, అభినవ్ గొమఠం ప్రధాన పాత్రల్లో నటించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హీరో నిఖిల్ ట్వీట్
Hey @NaveenPolishety Mama... Congrats on ur Success .. soo happy for u ❤️🎉 #MissShettyMrPolishetty nenu ikkada Vietnam la undi dint get to watch.. ikkada kuda oka show epiyocchu ga...
— Nikhil Siddhartha (@actor_Nikhil) September 13, 2023
congrats to team @UV_Creations dir Mahesh @MsAnushkaShetty garu... https://t.co/yTe1fRMpIf