Alias Rukmini Trailer: నితిన్ 'అలియాస్ రుక్మిణీ'.. ట్రైలర్‌తోనే నవ్వులు, ఎమోషన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో విభిన్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నేచురల్ స్టార్ నాని సమర్పణలో యంగ్ హీరో నితిన్ ఓ వినూత్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వీరిద్దరి కలయికలో రూపొందిన క్రేజీ మూవీ 'అలియాస్ రుక్మిణీ'. యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ సినిమాకు మురళీ కాంత్ దేవసోత్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
వివరాలు
తన
ట్రైలర్‌ను చూస్తుంటే ఇదొక వింటేజ్ ఫీల్ ఉన్న రొమాంటిక్ కామెడీతో పాటు ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కినట్లు తెలుస్తోంది.
ఇందులో నితిన్ 'కృష్ణ' అనే ఫ్యామిలీ కోర్టు స్టెనో పాత్రలో కనిపించనున్నాడు. పైకి అమాయకంగా, పద్ధతిగా కనిపించే కృష్ణలో ఎవరికీ తెలియని ఓ రహస్య కోణం ఉంటుంది.
"కోరికలే గుర్రాలైతేనా.. ఛీ ఛీ ఇదేంటి, ఇవి చదువుతున్నాడా?" అని ఇంట్లోవాళ్లు ఆశ్చర్యపోతుంటే.. "చదవట్లేదు.. రాస్తున్నాడు!" అంటూ వచ్చే ట్విస్ట్ నవ్వులు పూయిస్తోంది.
అంతేకాదు.. కృష్ణ రొమాంటిక్ పుస్తకాలను తన పేరుతో కాకుండా ఓ అమ్మాయి పేరుతో రాస్తుంటాడని ట్రైలర్‌లో చూపించారు.
అందుకే చివర్లో "ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలవాలి? కృష్ణ అనా.. లేకపోతే రుక్మిణీ అనా?" అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది.
వివరాలు
పెళ్లిచూపుల సన్నివేశాలు.. అదిరిపోయే డైలాగ్స్
సినిమా టైటిల్ వెనుక ఉన్న అసలు విషయాన్ని కూడా ఈ సన్నివేశం ఆసక్తికరంగా తెలియజేస్తోంది.
ట్రైలర్‌లో పెళ్లిచూపులకు సంబంధించిన సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వరుసగా ముగ్గురు అమ్మాయిలు రిజెక్ట్ చేసిన తర్వాత నాలుగో పెళ్లిచూపులకు వెళ్లిన కృష్ణ.. అక్కడ హీరోయిన్‌తో మాట్లాడే తీరు ఆకట్టుకుంటోంది.
నీకిది ఎన్నో పెళ్లిచూపులు?" అని హీరో అడగ్గా.. "నన్ను ఎంతమంది రిజెక్ట్ చేశారో తెలుసుకోవడానికా?" అని హీరోయిన్ ప్రశ్నిస్తుంది.
దానికి కృష్ణ "లేదు.. నన్ను కలవడానికి మీరు ఎంతమందిని రిజెక్ట్ చేశారో తెలుసుకుందామని" అంటూ ఇచ్చే సమాధానం యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది.