Nithin : "ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" నుంచి మరో అప్డేట్.. సెట్'లో 300 డాన్సర్లతో అదుర్స్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కథనాయకుడిగా తెరకెక్కుతున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ తాజా అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి. సెట్స్'లో మాస్ నంబర్, 300 డాన్సర్లతో షూటింగ్ చేస్తున్నామని చిత్ర నిర్మాణ బృందం తెలిపింది.త్వరలోనే ట్రైలర్ కబురును వెల్లడించనున్నట్లు పేర్కొంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ బాణీలను అందిస్తున్నారు. డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్నఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్'గా జోడి కట్టింది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 8, 2023న రిలీజ్ కానున్న ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.