Extra-ordinary Man Trailer: నితిన్ 'ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ వచ్చేసింది.. ఫుల్ ఎంటర్‌టైన్మెంట్‌తో అదిరిపోయిందిగా!
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ హీరో నితిన్(Nitin) , శ్రీలీల (Srileela) జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్'(Extra-ordinary Man).
శ్రేష్ట మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్‌కు అదిరిపోయే స్పందన లభించింది.
తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ను ఇవాళ విడుదల చేశారు.
ట్రైలర్ ను చాలా వరకు కామెడీతో ఉండగా, మధ్య కాస్త యాక్షన్ ను జోడించారు.
ఈ మూవీలో నితిన్ ఓ జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపించనున్నాడు. తండ్రి పాత్రలో రావు రమేష్ తన కామెడీతో ఆకట్టుకున్నాడు.
Details
డిసెంబర్ 8న ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్ రిలీజ్
ట్రైలర్‌లో జీవితం చెప్పేది తప్ప.. జీవితంలో ఎవరు ఏం చెప్పినా విననని రాజశేఖర్ అని అంటాడు . దానికి జీవితా సార్ అని నితిన్ అడుగుతాడు. ఈ సీన్ బాగా నవ్వించింది.
మొత్తానికి సినిమా సరదాగా సాగిపోయే ఓ ఫ్యామిలీ డ్రామాగా కనిపిస్తోంది.
ఈ సినిమాకు హ్యారిస్ జయరాజ్ సంగీతాన్ని సమకూర్చాడు.
ఈ ఎక్ట్స్రా ఆర్డినరీ మూవీ డిసెంబర్ 8న విడుదల కానుంది.
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్.. ఈ మూవీపై భారీ ఆశలే పెట్టుకున్నాడు.