LOADING...
Vishal: డూప్‌ అవసరం లేదు.. అందుకే 119 కుట్లు పడ్డాయి : విశాల్‌ 
డూప్‌ అవసరం లేదు.. అందుకే 119 కుట్లు పడ్డాయి : విశాల్

Vishal: డూప్‌ అవసరం లేదు.. అందుకే 119 కుట్లు పడ్డాయి : విశాల్‌ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2025
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

నటుడు విశాల్‌ (Vishal) ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో తన అనుభవాలను పంచుకున్నారు. ఆయన తన శరీరానికి ఇప్పటివరకూ 119 కుట్లు పడ్డాయని వెల్లడించారు. సినిమాల్లో ఏ స్థాయి స్టంట్స్‌ అయినా, వాటిని స్వయంగా చేయడం తనకు ఇష్టం ఉందని, డూప్‌ ద్వారా చేయించడం మాత్రం మానసికంగా ఇష్టం లేదని చెప్పారు. ఎక్కువగా అక్షన్ సీక్వెన్స్‌లలో గాయాల కారణంగా ఈ కుట్లు వచ్చినట్లు విశాల్‌ వివరించారు. అలాగే, ఈ పాడ్‌కాస్ట్‌లో నటుడు అర్జున్‌తో తన అనుబంధం, హిట్ మూవీ 'పందెం కోడి'లో అవకాశాలు ఎలా లభించాయో కూడా గుర్తు చేసుకున్నారు.

Details

మకుటం షూటింగ్ లో బిజీ

ప్రస్తుతానికి ఈ పాడ్‌కాస్ట్ ప్రోమో వీడియో విడుదల అయింది. ఈ ఏడాది 'మదగజరాజ'తో విజయాన్ని అందుకున్న విశాల్‌, ప్రస్తుతం 'మకుటం' (Makutam) చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన కెరీర్‌లో 35వ చిత్రం. కోలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం, దర్శకుడు, రవి అరసుతో కొన్ని విభేదాల కారణంగా, ఆ సినిమాను స్వయంగా నిర్మించాలన్న ఆలోచనలో విశాల్‌ ఉన్నారు. అదేవిధంగా, ఆయన నటి ధన్సికతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసింది. త్వరలోనే ఆ రొమాంటిక్ పాఠం పూర్తి చేసేందుకు వారు ఏడడుగులు వేయనున్నారు.