
MET Gala: ఉల్లి లేదూ వెల్లుల్లి లేదూ.. మెట్ గాలా గోల్డెన్ రూల్స్ ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటైన మెట్ గాలా (Met Gala) మరోసారి వార్తల్లోకి ఎక్కుతోంది.
ఈ కార్యక్రమం ప్రతేడాది అమెరికా న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ - కాస్ట్యూమ్ ఇన్‌స్టిట్యూట్ నిధుల సమీకరణ కోసం నిర్వహిస్తారు.
ప్రముఖులు ఫ్యాషనబుల్ దుస్తులతో రెడ్ కార్పెట్‌ను రక్తిమం చేస్తారు. ఈ ఏడాది మెట్ గాలా 'సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్' అనే థీమ్‌తో మే 5న (భారత కాలమానం ప్రకారం మే 6 ఉదయం 3 గంటలకు) జరగనుంది.
ఈ వేడుకలో బాలీవుడ్ నుండి షారుక్ ఖాన్, ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, దిల్జిత్ దోసాంఝ్ లాంటి ప్రముఖులు హాజరవుతుండటంతో ఈసారి భారతీయుల ఆసక్తి మరింత పెరిగింది.
Details
ఈవెంట్ కు ప్రత్యేక నిబంధనలు
ముఖ్యంగా షారుక్ ఖాన్ మెట్ గాలా ఈవెంట్‌లో తొలిసారిగా పాల్గొనడం విశేషం. ఈ ఈవెంట్‌కు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఉండటం విశేషం.
మెట్ గాలా విందులో ఉల్లి, వెల్లుల్లి, పార్స్లీ లాంటి పదార్థాలు వాడకూడదు.
ఇవి శరీరం నుండి భిన్నమైన వాసనలను ఉద్గతం చేసే అవకాశం ఉండటంతో, ఇతరులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో నిర్వాహకులు ఈ ఆహార పదార్థాలను మెనూ నుండి తొలగించారు.
అలాగే బ్రుషెట్టా అనే డిష్‌ను కూడా మెనూలోంచి తొలగించారు. ఇంకా ఒక ముఖ్యమైన నియమం 'నో ఫోన్ పాలసీ' సెలబ్రిటీలు ఈ వేడుకకు ఫోన్‌లు తీసుకురావడానికి అనుమతి లేదు.
Details
సీటింగ్ ను ముందుగానే ప్లాన్ చేసిన ప్లాన్
రెడ్ కార్పెట్ ఫొటోలు మాత్రమే బహిరంగంగా పంచుకుంటారు కానీ ఈవెంట్ లోపల ఫొటోలు బయటికి రావు. అంతేకాదు, ఈవెంట్ ప్రాంగణంలో స్మోకింగ్‌ను కూడా కఠినంగా నిషేధించారు.
ఇక మరో ఆసక్తికర విషయం - ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరు సుమారు $75,000 (అంటే రూ. 62 లక్షలకుపైనే) చెల్లించాల్సి ఉంటుంది.
గతంలో ఇది $50,000 కాగా, ఇటీవల పెంచారు. అయితే డబ్బు చెల్లించినంత మాత్రాన ఎవరు ఏ చోట కూర్చోవాలో వారు నిర్ణయించలేరు. సీటింగ్‌ను నిర్వాహకులే ముందుగానే ప్లాన్ చేస్తారు
అది కూడా డిసెంబర్ నాటికి ఫిక్స్ అయిపోతుంది. అంతేకాదు, సెలబ్రిటీలు ధరించే దుస్తులను ముందుగానే ఆమోదం కోసం సమర్పించాలి. నిర్వాహకులు అనుమతిస్తేనే వాటిని వేడుకకు ధరించవచ్చు.