Page Loader
Nobuyo Oyama: 'డోరేమాన్'కు డబ్బింగ్‌ చెప్పిన నోబుయో ఒయామా కన్నుమూత 
'డోరేమాన్'కు డబ్బింగ్‌ చెప్పిన నోబుయో ఒయామా కన్నుమూత

Nobuyo Oyama: 'డోరేమాన్'కు డబ్బింగ్‌ చెప్పిన నోబుయో ఒయామా కన్నుమూత 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 11, 2024
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీవీల్లో కార్టూన్‌ షోలు చూసే పిల్లలు, అలాగే చిన్నప్పుడు చూసిన పెద్దవాళ్లలో 'డోరేమాన్' గురించి తెలియని వారు ఉండరు. ఈ కార్టూన్‌ షోలో డోరేమాన్‌ పాత్రకు డబ్బింగ్‌ ఇచ్చిన జపాన్‌ మహిళ నోబుయో ఒయామా ఇకలేరు. వృద్ధాప్య సంబంధ అనారోగ్య కారణాల వల్ల ఆమె కన్నుమూశారు. ఆమె వయస్సు 90 సంవత్సరాలు. గత నెల 29న వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో నోబుయో ఒయామా మరణించినట్లు ఆమె కుటుంబసభ్యులు శుక్రవారం ప్రకటించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న డోరేమాన్‌ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డోరేమాన్‌ అంటే వారికోసం నోబుయోనే గుర్తుకు వస్తుందని వారు చెప్పారు. 2005 వరకు నోబుయో డోరేమాన్‌ పాత్రకు డబ్బింగ్‌ అందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

90 సంవత్సరాల వయస్సులో నోబుయో ఒయామా కన్నుమూత