Loading...
Allu Arjun: సినిమాలకే కాదు.. సేవలోనూ ముందే.. అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అరుదైన రికార్డు
సినిమాలకే కాదు.. సేవలోనూ ముందే.. అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అరుదైన రికార్డు

Allu Arjun: సినిమాలకే కాదు.. సేవలోనూ ముందే.. అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అరుదైన రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2026
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

అభిమాన సంఘాలు తమ అభిమాన హీరో సినిమాలను ప్రమోట్‌ చేయడంతోనే పరిమితం కావాల్సిన అవసరం లేదని, సామాజిక బాధ్యతలోనూ ముందుండొచ్చని ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ (ఆఫా) నిరూపిస్తోంది. దేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'స్వస్థ్‌ నారీ వికసిత్‌ భారత్‌' కార్యక్రమంలో భాగంగా 'ఆఫా' మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 400కుపైగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. వీటి ద్వారా సుమారు లక్ష మంది యువతులకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణపై అవగాహన కల్పించింది. యువతులు, బాలికలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో అల్లు అర్జున్‌ అభిమానులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

వివరాలు

'రాకా'లో అల్లు అర్జున్

సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు సామాజిక అంశాలపైనా దృష్టి సారిస్తూ 'ఆఫా' సభ్యులు చేస్తున్న సేవలను పలువురు అభినందిస్తున్నారు.

అభిమాన సంఘాలు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవచ్చని ఈ కార్యక్రమాల ద్వారా 'ఆఫా' చాటిచెబుతోందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక అల్లు అర్జున్‌ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ చిత్రం 'రాకా'లో నటిస్తున్నారు.

ఈ సినిమాలో దీపికా పదుకొణె, రష్మిక మందన్న, మృణాల్‌ ఠాకూర్‌ వంటి ప్రముఖ కథానాయికలు అల్లు అర్జున్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు.

ADVERTISEMENT