Junior NTR: హైకోర్టు మెట్లెక్కిన జూనియర్ ఎన్టీఆర్.. భూ వివాదంలో మహిళప కేసు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.75లో ఉన్న తన భూ వివాదం కేసుపై నటుడు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే, ఎన్టీఆర్ 2003లో సుంకు గీతా లక్ష్మి అనే మహిళ నుంచి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలాన్నీ కొనుగోలు చేశారు. చట్ట ప్రకారం అన్ని అనుమతులు పొంది అదే ఏడాది ఇంటి నిర్మాణం కూడా చేపట్టారు. కానీ ఈ స్థలంపై వివాదం చెలరేగింది.
ఎన్టీఆర్ కు షాకిచ్చిన రికవరీ ట్రిబ్యునల్
సమాచారం ప్రకారం,ఆ భూమిని ఎన్టీఆర్ కు అమ్మక ముందే సుంకు గీత 1996లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి లోన్ తీసుకున్నారంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్ఫేసీ యాక్ట్ కింద డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాయి. దీంతో ఈ స్థలానికి సంబంధించి ఎన్టీఆర్ కు నోటీసులు వచ్చాయి. అయితే రుణ క్లియరెన్స్ విషయమై బ్యాంకు మేనేజర్లు పలుమార్లు ఎన్టీఆర్ కు ఫోన్ చేశారు. 2019లో తాను అసలు నిందితుడిని కానప్పటికీ బ్యాంకు మేనేజర్లు డబ్బులు అడుగుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2019లో ఈ వ్యవహారంలో దీనిపై పోలీసులు ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు.
సుంకు గీతపై కేసు నమోదు
తాజాగా గీతకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు డెట్ రికవరీ ట్రిబ్యునల్ (DRT)ని ఆశ్రయించాయి. ఎన్టీఆర్‌పై డీఆర్‌టీ ఉత్తర్వులు జారీ చేసింది. డీఆర్‌టీ ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. గీతపై కేసు నమోదైందని, ఈ పిటిషన్‌పై జూన్ 6న విచారిస్తామని హైకోర్టు పేర్కొంది.