Page Loader
NTR Devara : దేవరలో టక్కేసిన ఎన్టీఆర్.. గ్లింప్స్ రిలీజ్ ఎప్పుడో తెలుసా
గ్లింప్స్ రిలీజ్ ఎప్పుడో తెలుసా

NTR Devara : దేవరలో టక్కేసిన ఎన్టీఆర్.. గ్లింప్స్ రిలీజ్ ఎప్పుడో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jan 01, 2024
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేవర సినిమా నుంచి మరో ఆసక్తికర సమాచారం వచ్చేసింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ గ్లింప్స్ విడుదల తేదీని ప్రకటించారు. RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులు, అభిమానుల కోసం కొరటాల శివ దర్శకత్వంలో దేవర తెరకెక్కుతోంది. ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క పోస్టర్ మాత్రమే రిలీజ్ అయింది. గత కొన్ని రోజులుగా దేవర టీజర్ రిలీజ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే దేవర మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, టీజర్ రెఢీ అయిందంటూ అంచాలను అమాంతం పెంచేశాడు.

details

ఏప్రిల్ 5న పార్ట్ 1 రిలీజ్

ఇటీవలే కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా ప్రమోషన్స్'లో దేవర టీజర్ గురించి స్పందించారు. తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా దేవర నుంచి ఆసక్తికర అప్డేట్ రిలీజ్ అయ్యింది. తాజాగా విడుదలైన పోస్టర్'లో ఎన్టీఆర్ సీరియస్ లుక్ ఇస్తూ కనిపించారు. బ్లాక్ డ్రెస్'లో టక్ వేసుకుని పడవలో నించొని సముద్రంలోంచి వస్తున్నట్టు అదిరిపోయే స్టిల్ ఇచ్చారు. ఇదే సమయంలో జనవరి 8న దేవర గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. దీంతో అభిమానులు సందడిలో మునిగిపోయారు. దేవరను 2 పార్టులుగా ప్రకటించారు. తొలి పార్టు 2024 ఏప్రిల్ 5లో రిలీజ్ చేయనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్'గా, సైఫ్ అలీఖాన్, మలయాళం స్టార్ షైన్ టామ్ చాకోలు విలన్లుగా నటిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దేవర టీమ్ ట్వీట్