LOADING...
War2: 'వార్‌ 2' ఎనర్జిటిక్‌ సాంగ్‌ 'సలాం అనాలి' ప్రోమో విడుదల.. డాన్స్'తో అదరగొట్టిన ఎన్టీఆర్‌-హృతిక్‌

War2: 'వార్‌ 2' ఎనర్జిటిక్‌ సాంగ్‌ 'సలాం అనాలి' ప్రోమో విడుదల.. డాన్స్'తో అదరగొట్టిన ఎన్టీఆర్‌-హృతిక్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2025
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ చిత్రంలో గ్లామర్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా, దర్శకత్వ బాధ్యతలను టాలెంటెడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ చేపట్టాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ మూవీ ఈ ఏడాది ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ - హృతిక్ మధ్య మాస్ యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉంటాయో చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

వివరాలు 

ఎన్టీఆర్ అభిమానుల్లో కొంత అసంతృప్తి

ఇటీవల వరుసగా ప్రమోషనల్ కంటెంట్ విడుదల కావడం లేదన్న కారణంగా ఎన్టీఆర్ అభిమానుల్లో కొంత అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు వారి కోసం ఒక శుభవార్తను యష్ రాజ్ ఫిలిమ్స్ అందించింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి డ్యాన్స్ చేసే మాస్ నంబర్ గురించి చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ, తాజాగా ఆ డాన్స్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ 

వివరాలు 

ఎన్టీఆర్, హృతిక్ చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ 

'సలామ్ అనాలి' అనే పేరుతో వస్తున్న ఈ పాటలో ఎన్టీఆర్, హృతిక్ చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ప్రస్తుతం ప్రేక్షకులకు కేవలం ప్రోమోను మాత్రమే విడుదల చేస్తూ, పూర్తి పాటను థియేటర్‌లోనే చూడాలని ప్లాన్ చేసింది చిత్రబృందం. భారీ 70MM తెరపై ఇద్దరు డాన్స్ మాస్టర్లను చూస్తే అది నిజంగా ఓ విజువల్ ట్రీట్‌గా ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఫుల్ సాంగ్‌ను థియేటర్లలోనే ఫస్ట్ డే ఫస్ట్ షోలో చూసి ఆనందించండి అనే ఉద్దేశంతోనే మేకర్స్ ప్రోమోకే పరిమితం అయ్యారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రం ఇంకా ఏడు రోజుల్లో విడుదల కాబోతుండటంతో, ప్రేక్షకుల్లో అంచనాలు ఊపందుకున్నాయి.