NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / NTR Neel: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌కి ముహూర్తం ఫిక్స్.!
    తదుపరి వార్తా కథనం
    NTR Neel: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌కి ముహూర్తం ఫిక్స్.!
    ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌కి ముహూర్తం ఫిక్స్.!

    NTR Neel: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌కి ముహూర్తం ఫిక్స్.!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 29, 2024
    05:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న విషయం తెలిసిందే.

    కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'దేవర' సినిమా ద్వారా బ్లాక్‌బస్టర్ హిట్ ను అందుకున్నాడు తారక్.

    ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల వసూళ్లను సాధించింది.

    అయితే ఈ సినిమా అనంత‌రం క‌న్న‌డ స్టార్ ద‌ర్శ‌కుడు, కేజీఎఫ్, సలార్ సినిమాలతో ప్రసిద్ది చెందిన కర్ణాటక స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

    ఈ చిత్రానికి "#NTRNeel" అనే పేరు ఉండవచ్చని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం "డ్రాగన్" అనే టైటిల్‌తో రాబోతుందని ప్రచారం జరుగుతోంది.

    వివరాలు 

    కథానాయికగా రుక్మిణి వసంత్

    ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి కాగా, డిసెంబరులో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

    2025 ఫిబ్రవరిలో తారక్ ఈ చిత్రంలో పాల్గొనబోతున్నాడని సమాచారం. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా టైటిల్‌ను సంక్రాంతి పండుగ సందర్భంగా 2025 జనవరిలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

    మేకర్స్ "డ్రాగన్" అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారా?,లేక కొత్త టైటిల్‌తో వస్తారా అన్న విషయం తెలియాలంటే సంక్రాంతి వ‌ర‌కు ఆగాల్సిందే.

    ఇక, ఈ చిత్రంలో'సప్త సాగరాలు దాటి'చిత్ర హీరోయిన్ రుక్మిణి వసంత్ కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది.

    ఈ సినిమా ఒకే పార్ట్‌లో పూర్తయ్యే అవకాశం ఉంది.ఈ సినిమా 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జూనియర్ ఎన్టీఆర్

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    జూనియర్ ఎన్టీఆర్

    Jr NTR: పెద్ద మనసు చాటుకున్న జూనియర్ ఎన్టీఆర్..తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి విరాళం టాలీవుడ్
    Devara: ముంబైలో 'దేవర' ట్రైలర్ లాంచ్ ఈవెంట్? దేవర
    Devara: ఓవర్సీస్ 'దేవర' రికార్డులు.. ట్రైలర్ ఎప్పుడంటే? దేవర
    Devara: 'దేవర' సంచలనం.. ఓవర్సీస్‌లో ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డు దేవర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025