Odela 2 Teaser: మహాకుంభమేళాలో తమన్నా ఓదెల2 టీజర్ రిలీజ్ ..
ఈ వార్తాకథనం ఏంటి
తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ఓదెల 2'.
2021లో ఘన విజయం సాధించిన 'ఓదెల రైల్వే స్టేషన్' సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది.
అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్లపై నిర్మాత డి మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది. తమన్నా పోషిస్తున్న నాగ సాధు పాత్రకు సంబంధించిన ఫెరోషియస్, స్టన్నింగ్ పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.
ఇప్పుడు 'ఓదెల 2' టీమ్ మరో భారీ అప్‌డేట్‌తో వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఫిబ్రవరి 22న కాశీ మహా కుంభమేళాలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
వివరాలు
కాశీ మహా కుంభమేళాలో లాంచ్ అవుతున్న మొదటి టీజర్
'ఓదెల 2' టీజర్ కాశీ మహా కుంభమేళాలో లాంచ్ అవుతున్న మొదటి టీజర్ కావడం విశేషం.
ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో కుంభమేళా బ్యాక్‌డ్రాప్‌లో నాగ సాధుగా తమన్నా లుక్ అద్భుతమైన దైవిక ఆరాధనను గుర్తు చేస్తోంది.
ఈ చిత్రంలో తమన్నా భాటియా ప్రఖరమైన యాక్షన్ సీక్వెన్స్‌లను ప్రదర్శించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిందని సమాచారం.
భారీ బడ్జెట్‌తో, అత్యున్నతమైన ప్రొడక్షన్ విలువలతో 'ఓదెల 2' రూపొందుతోంది. ప్రత్యేకంగా, ఈ చిత్రానికి 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
#Odela2 Teaser will be launched at the divine atmosphere of the Maha Khumb Mela in Prayagraj #Odela2Teaser out on February 22nd
— TrackTollywood (@TrackTwood) February 19, 2025
Soon in cinemas nationwide.@tamannaahspeaks @IamSampathNandi @ashokalle2020 @ihebahp @ImSimhaa @AJANEESHB pic.twitter.com/df3b73h4sO