SSMB 29: ఒడిశా షూటింగ్ ముగిసింది.. హైదరాబాద్‌కు చేరుకున్న చిత్ర బృందం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) నటుడు మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న భారీ చిత్రం 'SSMB 29'. ఒడిశా షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది.
ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) కథానాయికగా నటిస్తుండగా, 15 రోజులుగా ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
ముఖ్యంగా సిమిలిగుడ సమీపంలోని మాలి, పుట్‌సీల్, బాల్డ ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది.
షెడ్యూల్ ముగింపు - అభిమానుల ఆసక్తి
మంగళవారం రాత్రి ఒడిశా షెడ్యూల్ ముగియడంతో చిత్రబృందాన్ని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
షూటింగ్ సెట్స్‌కు చేరుకున్న వారు నటీనటులు, చిత్రబృందంతో ఫొటోలు దిగారు.
Details
ప్రకృతి అందాలపై రాజమౌళి ప్రశంసలు
పొట్టంగి ఎమ్మెల్యే రామ్‌చంద్ర కడం నేతృత్వంలో పలువురు ప్రజాప్రతినిధులు చిత్రబృందాన్ని కలిశారు.
ఈ సందర్భంగా రాజమౌళి ఒడిశా ప్రకృతి అందాలను స్వర్గసీమగా వర్ణిస్తూ, స్థానికుల సహకారం ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు.
ఆయన థాంక్స్ నోట్‌ను జిల్లా అధికారులకు అందజేశారు. యూనిట్ సభ్యులంతా మంగళవారం రాత్రే హైదరాబాద్‌కు తిరిగి రాగా, దర్శకుడు రాజమౌళి, హీరో మహేశ్ బాబు బుధవారం ఉదయం ఒడిశా నుంచి బయలుదేరారు.
బయలుదేరే ముందు జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ, జయపురం సబ్ కలెక్టర్ సస్యరెడ్డి, ఇతర అధికారులు మహేశ్ బాబుతో ఫొటోలు దిగారు.