
OG: హైదరాబాద్‌లో 'ఓజీ' ఫ్రీ రిలీజ్ ఈవెంట్.. వెన్యూ ఎక్కడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓజీ. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. హరిహర వీరమల్లు ఆశించిన స్థాయి విజయాన్ని ఇవ్వకపోవడంతో, ఈసారి OGతో బ్లాక్‌బస్టర్ కొట్టాలని పవర్ స్టార్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక తమన్ అందిస్తున్న సెన్సేషనల్ సంగీతం సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. రిలీజ్‌కు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ఉండటంతో, మేకర్స్ ప్రమోషన్ల వేగం పెంచారు. ఈ క్రమంలోనే ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకను సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించనున్నారు.
Details
ఏపీలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్
ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరు కానున్నారని సమాచారం. ఈ వేడుకను కనివిని ఎరుగని రీతిలో చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే తెలంగాణ ఈవెంట్‌కి అదనంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చూస్తున్నారు. ఈ వేడుకను విజయవాడ లేదా విశాఖపట్నంలో పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. అనుమతులపై స్పష్టత వచ్చిన తర్వాత ఆ వివరాలు ప్రకటించనున్నారు. ఇకపై తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామున ప్రత్యేక షోలు కోసం థియేటర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ OGతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.