OG Movie: 'ఓజీ' కవర్ పోస్టర్ విడుదల.. డార్క్ షేడ్స్‌లో పవన్ లుక్
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్ విడుదల కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఈ అంచనాలను మరింత పెంచుతూ, సినిమా పై హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తూ, మేకర్స్ కవర్ పోస్టర్‌ను విడుదల చేశారు.
వివరాలు
ఈ దారులు తిరిగి ఎప్పటికీ మళ్లీ అలా కనిపించవు
ఈ పోస్టర్‌లో ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా ముందు విధ్వంసం సృష్టించి, మరణ మృదంగం మోగిస్తున్న ఓజిని మనం చూడవచ్చు.
డార్క్ షేడ్స్‌లో పవన్ లుక్ అదిరిపోయేలా ఉంది. "ఈ దారులు తిరిగి ఎప్పటికీ మళ్లీ అలా కనిపించవు" అనే క్యాప్షన్‌ను ఈ పోస్టర్‌కు జత చేశారు.
దీంతో ఈ సినిమాలో యాక్షన్ డోస్ ఏ లెవెల్‌లో ఉండబోతుందో కవర్ పోస్టర్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో ప్రియాంక ఆరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హస్మీ, శ్రేయారెడ్డి, అర్జున్ దాస్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి.వి.వి. దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న పోస్టర్ ఇదే..
The streets will never be the same again…….🔥🔥#OG #TheyCallHimOG #FireStormIsComing pic.twitter.com/MXCGxOknJi
— DVV Entertainment (@DVVMovies) October 19, 2024