Om Bheem Bush: శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ టీజర్ విడుదలయ్యేది.. అప్పుడే ?
శ్రీ విష్ణు,హుషారు దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి కాంబోలో వస్తున్నలేటెస్ట్ సినిమా" ఓం భీమ్ బుష్" నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ అనేది ఉపశీర్షిక. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 26న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రీతి ముకుందన్,అయేషా ఖాన్ హీరోయిన్స్ గా నటించగా,శ్రీకాంత్ అయ్యంగార్,ఆదిత్య మీనన్,రచ్చ రవి కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ చిత్రానికి సన్నీఎం ఆర్ సంగీతం అందిస్తుండగా వి సెల్యులాయిడ్ వారు నిర్మిస్తున్నారు. వచ్చే నెల 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.