Page Loader
Odela 2: శివశక్తిగా తమన్నా భాటియా.. 'ఓదెల 2' నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల 
Odela 2: శివశక్తిగా తమన్నా భాటియా.. 'ఓదెల 2' నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Odela 2: శివశక్తిగా తమన్నా భాటియా.. 'ఓదెల 2' నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 08, 2024
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓదెల-2 ఓపెనింగ్ మార్చి 1న జరిగింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మేకర్స్ ప్రారంభించారు. ఓదెల రైల్వే స్టేషన్‌లో హెబ్బా పటేల్ నటించగా.. ఓదెల 2లో మాత్రం మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తున్నారు. నేడు మహాశివరాత్రి సందర్భంగా తమన్నా భాటియా 'ఒదెలా 2' నుండి తన ఫస్ట్ లుక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మహాశివరాత్రి సందర్భంగా ఆమె పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శివశక్తి పాత్రలో తమన్నా అదిరిపోయింది. కాశీ గంగా నది తీరాన తమన్నా నడుస్తున్న ఫొటోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ చేతిలో ఢమరుఖం, మరో చేతిలో దండం పట్టుకుని తమన్నా ఉన్నారు.ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Details 

ఏడాదిన్నర గ్యాప్ తర్వాత 'ఒదెల రైల్వే స్టేషన్' సినిమాకు సీక్వెల్

తమన్నా ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ,"#FirstlookOdela2. ఈ పవిత్రమైన మహా శివరాత్రి రోజున ఫస్ట్‌లుక్‌ని రివీల్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. హర్ హర్ మహాదేవ్! హ్యాపీ మహా శివరాత్రి (sic)" అని రాశారు. 'ఒదెల రైల్వే స్టేషన్'లో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహతో పాటు యువ,నాగ మహేష్,వంశీ,గగన్ విహారి,సురేందర్ రెడ్డి,భూపాల్,పూజా రెడ్డి కీలక పాత్రలలో నటించారు. అశోక్ తేజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. 'ఓదెల 2'గా సీక్వెల్ రాబోతుంది.సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్రాఫర్ కాగా,కాంతారావు ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 మేకర్స్ చేసిన ట్వీట్