
సంక్రాంతి బరిలో థియేటర్లలో తెలుగు సినిమాలు మాత్రమే
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పుడు సినిమా పరిశ్రమ దృష్టి అంతా వచ్చే సంక్రాంతి పండగ మీద ఉంది.
కాంతారా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరికొన్ని పర భాషా సినిమాలు తెలుగులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాయి.
వచ్చే పండగ సీజన్ పైన వాటి కన్నుపడింది.
అయితే తెలుగు పరిశ్రమకు ఎదురవుతున్న సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ కు థియేటర్ ప్రదర్శనకు ముందుగా తెలుగు సినిమాలకు ప్రాధాన్యతను ఇవ్వాలని కోరుతూ లేఖ రాశారు.
సంక్రాంతి పండగ మీద చాలా సినిమాలు ఆశలు పెట్టుకున్నాయి ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ విజయ్ సినిమా 'వారిసు' తెలుగు వారసుడిగా సంక్రాంతి బరిలో నిలుస్తుంది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సంక్రాంతి పండగ
తెలుగు ఫిలిం ఛాంబర్ సభ్యులందరూ అకస్మాత్తుగా సమావేశమయ్యి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
మొదటగా థియేటర్లు పండగల సీజన్ లో అనగా సంక్రాంతి, దసరా పండగలప్పుడు తెలుగు సినిమాలకు మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వాలని తీర్మానించారు. పెద్ద సినిమాల నిర్మాతలకు ఇది శుభవార్తే.
మాములుగా సినిమాలు పండగ సీజన్ లో రిలీజ్ చేయడానికి కారణం టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తాయని.
అయితే కోవిడ్ తర్వాత పరిస్థితి మారింది ఎంత పెద్ద హీరో అయినా సినిమా రివ్యూ చూసి బాగుంటేనే జనాలు థియేటర్లకు వెళ్తున్నారు.
ఫిలిం ఛాంబర్ నిర్ణయం వలన ఈసారి సంక్రాంతి బరిలో నిలిచే తెలుగు సినిమాలకు కాసుల వర్షం ఖాయమని అర్ధమవుతుంది.
వాల్తేరు వీరయ్య, వీరనరసింహారెడ్డి వంటి సినిమాలకు ఎటువంటి టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో నిరాశ పడాల్సిన పనిలేదని సృష్టంగా తెలుస్తుంది.