ఇవాళ ఓటీటీలోకి ఆపరేషన్ అలమేలమ్మ.. ఎందులో లైవ్ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా
కన్నడ చిత్రసీమ సాండల్ వుడ్ లో ఇటీవలే రిలీజైన 'ఆపరేషన్ అలమేలమ్మ' నేడు తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ మేరకు ఆహాలో విడుదలైంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. శ్రద్ధా శ్రీనాథ్ ప్రధానమైన పాత్రలో 'ఆపరేషన్ అలమేలమ్మ' రూపుదిద్దుకుంది. తెలుగులో శ్రద్ధా చేసిన సినిమాల్లో జెర్సీ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. త్వరలో రానున్న వెంకటేశ్ సైంధవ్ సినిమాలోనూ ఆమె అలరించనుంది. ఆపరేషన్ అలమేలమ్మ కథ బెంగళూరు మహానగరంలో జరుగుతూ ఉంటుంది. పరమేశ్ (రిషి) ఓ అనాథ. తనకి నా అన్న వాళ్లు ఎవరూ లేని జీవితాన్ని గడుపుతుంటాడు. బతకడం కోసం కూరగాయల మార్కెట్ లో పనిచేస్తుంటాడు.
రిషికి అనన్య ఎక్కడ పరిచమైందో తెలుసా
రిషికి ఎవరూ కన్యాదానం చేసేందుకు ముందుకురారన్న సంగతి అతనికి అర్థమైంది. అందువల్ల పెళ్లి కాని అమ్మాయిలు ఎక్కడ కనిపించినా వాళ్లనే పెళ్లి కూతురుగా ఊహించుకుంటాడు. దీంతో తృప్తి పొందుతూ ఉంటాడు. ఖరీదైన జీవితాన్ని గడపాలనీ,బ్రాండెండ్ వస్తువులను వాడాలని మరో పిచ్చి ఉంటుంది. అలాంటి వ్యక్తికి ఓ బట్టల షాపులో అనన్య (శ్రద్ధా శ్రీనాథ్)తో పరిచయం ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఆమెను అదే పనిగా ఫాలో అవుతుంటాడు. ఏదేమైనా తన గురించి ఆమె ఆలోచన చేసేలా చేస్తాడు. అనన్య స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంటుంది. తండ్రి లేని ఆ కుటుంబానికి ఆమె జీతమే జీవనాధారం. ఇలాంటి పరిస్థితుల్లో అనన్య ఆర్ధిక ఇబ్బందులను ఎవరు అనుకూలంగా మార్చుకున్నారు, ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే సినిమాపై లుక్కేయాల్సిందే.