ఖుషి నుండి వచ్చేస్తున్న కొత్త పాట: రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఓసి పెళ్ళామా ప్రోమో రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషి చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా మరో పాట ప్రోమోను ఖుషి టీమ్ విడుదల చేసింది.
ఓసి పెళ్ళామా అంటూ సాగే ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, సాకేత్ సంయుక్తంగా పాడారు. దర్శకుడు శివ నిర్వాణ ఈ పాటకు కూడా లిరిక్స్ అందించారు.
భార్య మీద ఫ్రస్ట్రేషన్ తో పాడుతున్న పాటలా కనిపిస్తున్న ఈ సాంగ్ పూర్తి లిరికల్ వీడియోను ఆగస్టు 26వ తేదీన రిలీజ్ చేస్తారట.
ఇప్పటివరకు ఖుషి నుండి రిలీజైన నాలుగు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. హేషమ్ వాహెబ్ అబ్దుల్ సంగీతానికి అందరూ ఫిదా అయ్యారు.
Details
ఖుషి సినిమాపై పెరుగుతున్న అంచనాలు
ఓసి పెళ్ళామా పాట కూడా అదిరిపోతుందని విజయ్ దేవరకొండ అభిమానులు ఆశిస్తున్నారు.
అదలా ఉంచితే, ఖుషి సినిమాపై విజయ్ దేవరకొండ అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. సమంత హీరోయిన్ కావడం కూడా ఈ అంచనాలు పెరగడానికి మరో కారణమని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఇటు విజయ్ దేవరకొండకు, అటు సమంతకు హిట్ చాలా అవసరం. లైగర్ ఫ్లాప్ తో విజయ్ దేవరకొండ సతమతమవుతుంటే, శాకుంతలం డిజాస్టర్ తో సమంత ఇబ్బంది పడుతోంది.
మరి ఖుషి సినిమా మంచి హిట్ అందిస్తుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.