నెట్ ఫ్లిక్స్ సూపర్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 వచ్చేస్తోంది: స్ట్రీమింగ్ ఎప్పుడు ముదలు కానుందంటే?
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చాక ప్రపంచ కంటెంట్ అందరికీ అందుబాటులో ఉంటోంది. ప్రపంచ దేశాల సిరీస్ లు, సినిమాలు చూసేస్తున్నారు. అయితే 2021లో నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన కొరియన్ సిరీస్ స్క్విడ్ గేమ్, ప్రపంచ వ్యాప్త ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. స్క్విడ్ గేమ్ చూసేందుకు జనం ఎగబడ్డారు. దీంతో నెట్ ఫ్లిక్స్ పంట పండి కాసులు కురిసాయి. తాజాగా స్క్విడ్ గేమ్ సీజన్ 2పై క్లారిటీ వచ్చింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన నెట్ ఫ్లిక్స్, చిన్నపాటి గ్లింప్స్ విడుదల చేసింది. ఈ సంవత్సరం నవంబరులో స్క్విడ్ గేమ్ సీజన్ 2, స్ట్రీమింగ్ కానుందని, అప్పటివరకూ వెయిట్ చేయాలని తెలియజేసింది.