Loading...
Pakistani Netflix Series: పాకిస్థానీ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌పై నిషేధం విధించాలి.. ప్రధాని మోదీకి AICWA లేఖ
పాకిస్థానీ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌పై నిషేధం విధించాలి.. ప్రధాని మోదీకి AICWA లేఖ

Pakistani Netflix Series: పాకిస్థానీ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌పై నిషేధం విధించాలి.. ప్రధాని మోదీకి AICWA లేఖ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2026
03:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌కు చెందిన రాబోయే నెట్‌ ఫ్లిక్స్ వెబ్‌సిరీస్ 'జో బచే హై సంగ్ సమేట్ లో' (Jo Bachay Hain Sang Samait Lo)పై నిషేధం విధించాలని అఖిల భారత సినీ కార్మికుల సంఘం (AICWA) డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. డిసెంబర్ 4న ప్రీమియర్ కానున్న ఈ సిరీస్‌ను ఇటీవలే ప్రకటించారు. అయితే భారత్‌లో ఈ వెబ్‌సిరీస్ విడుదలపై నెట్‌ఫ్లిక్స్ నుంచి ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. అయినప్పటికీ, దేశంలో ఈ సిరీస్‌పై పూర్తిస్థాయి నిషేధం విధించాలని AICWA కోరింది.

వివరాలు

2025 ప్రభుత్వ అడ్వైజరీని ప్రస్తావించిన AICWA

ప్రధాని మోదీకి రాసిన లేఖలో AICWA.. 2025 పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన అడ్వైజరీని ప్రస్తావించింది.

2025 మే 8న కేంద్ర మంత్రిత్వ శాఖ భారత్‌లోని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, స్ట్రీమింగ్ సేవలు, ఇతర మధ్యవర్తులకు కీలక సూచనలు జారీ చేసిందని పేర్కొంది.

పాకిస్థాన్‌లో రూపొందిన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు, ఇతర స్ట్రీమింగ్ కంటెంట్‌ను ప్రసారం చేయడం నిలిపివేయాలని ఆ అడ్వైజరీలో సూచించినట్లు AICWA తన లేఖలో వివరించింది.

ఇప్పుడు ఈ సిరీస్‌ను విడుదల చేయడం ఆ అడ్వైజరీ స్ఫూర్తికి, దేశ ప్రజల మనోభావాలకు విరుద్ధమని అభిప్రాయపడింది.

వివరాలు

పాకిస్థానీ కంటెంట్‌పై శాశ్వత చట్టం తీసుకురావాలని డిమాండ్

అన్ని ఓటీటీ, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు కేంద్ర ప్రభుత్వ అడ్వైజరీని కచ్చితంగా పాటించేలా ప్రధానమంత్రి చర్యలు తీసుకోవాలని AICWA కోరింది.

అంతేకాకుండా పాకిస్థానీ కంటెంట్, కళాకారులు, నిర్మాణ సంస్థలకు భారతీయ టెలివిజన్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, సినిమా థియేటర్లలో మళ్లీ ఎలాంటి అవకాశం లేకుండా కఠినమైన శాశ్వత చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేసింది.

నిబంధనలు ఉల్లంఘిస్తే అత్యంత కఠినమైన శిక్షలు విధించాలని తన లేఖలో పేర్కొంది.

పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా అభివర్ణిస్తూ.. ఆ దేశానికి చెందిన సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు, ఇతర కంటెంట్‌కు భారతీయ తెరలపై చోటు ఉండకూడదని AICWA తన లేఖలో పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు

పాక్ నవల ఆధారంగా వెబ్‌సిరీస్

'జో బచే హై సంగ్ సమేట్ లో' ప్రముఖ రచయిత్రి ఫర్హత్ ఇష్తియాక్ రాసిన బెస్ట్ సెల్లర్ ఉర్దూ నవల ఆధారంగా రూపొందింది.

ఇందులో ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్, అహద్ రజా మీర్, అహ్మద్ అలీ అక్బర్, హమ్జా అలీ అబ్బాసీ, బిలాల్ అష్రఫ్ తదితరులు నటించారు.

ఈ సిరీస్ చిత్రీకరణ పాకిస్థాన్, ఇటలీ, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో జరిగింది. మోమినా దురైద్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు మోమినా దురైద్ షో రన్నర్‌గా కూడా వ్యవహరించారు.

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఇండియా కేటలాగ్‌లో ఈ సిరీస్ అందుబాటులో లేదు. భారత్‌లో దీని విడుదలపై నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్విట్టర్ పోస్టు ఇదే

ADVERTISEMENT