
త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో మరో సినిమా.. ఈసారి పాన్ ఇండియా రేంజ్
ఈ వార్తాకథనం ఏంటి
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా భారీ అంచనాలతో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ బృందం అధికారికంగా ప్రకటించింది.
హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రం రూపొందించనున్నారు. ఈ మేరకు అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
ఇప్పటికే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో 3 సినిమాలు తెరకెక్కాయి. తాజాగా నాలుగో చిత్రం పట్టాలు ఎక్కనుంది.
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురం సినిమాలు సూపర్ హిట్ విజయం సాధించాయి. ఈ 3 సినిమాలు హారిక హాసిని క్రియేషన్స్ లోనే నిర్మించగా, నిర్మాతగా రాధాకృష్ణ వ్యవహరించారు.
గత కొద్ది రోజులుగా ఈ ముగ్గురి కాంబోలో మరో సినిమా వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
DETAILS
క్రేజీ కాంబినేషన్ లో అల్లు అర్జున్ 22వ సినిమా
ఈసారి నిర్మించబోయే సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందన్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర నిర్మాణ బృందం వెల్లడించింది.
పుష్ప భారీ విజయంతో బన్నీ ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే మరోసారి ఈ ముగ్గురి క్రేజీ కాంబినేషన్ లో రానున్న మరో పాన్ ఇండియా సినిమా పట్ల ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలోనే బన్నీ అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లో 22వ సినిమాగా తాజా చిత్రం తెరకెక్కనుంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే పుష్ప-2 నిర్మాణం పూర్తయ్యాక అల్లు అర్జున్ త్రివిక్రమ్ క్రేజీ సినిమా ఉండొచ్చని తెలుస్తోంది.