Prabhas Birthday: హ్యాపీ బర్త్ డే డార్లింగ్ - యంగ్ రెబెల్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా.. ప్రభాస్ ప్రస్థానమిది!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు తెలియని వారు ఇండియాలో అసలే లేరని చెప్పొచ్చు. 2002లో ఈశ్వర్ సినిమాతో తెలుగు చిత్రసీమలో ప్రభాస్ అడుగుపెట్టాడు. మొదటి సినిమానే కాకుండా రాఘవేంద్ర, వర్షం, అడవి రాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఎక్ నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, రెబల్, మిర్చి వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాడు. ఆపై దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన బాహుబలి సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలు తెలుగుసినిమా కూడా రూ. 2,000 కోట్ల వసూళ్లను సాధించగలదని నిరూపించాయి.
మొదటి దక్షిణాది నటుడిగా ప్రభాస్ రికార్డు
ప్రభాస్ విదేశీ మార్కెట్లలో 10 మిలియన్ డాలర్లకు పైగా సంపాదించిన మొదటి దక్షిణాది నటుడుగా నిలిచాడు. ఈ విజయంతో ఆయన స్టార్‌డమ్ అమాంతంగా పెరిగింది, తద్వారా పెద్ద ప్రొడ్యూసర్లు, దర్శకులు ఆయనను మాస్ సినిమాల కోసం మొదటి ఎంపికగా తీసుకుంటున్నారు. ఆ తర్వాత వచ్చిన సాహో, ఆది పురుష్ చిత్రాలు నిరాశపరిచగా, సలార్, కల్కి వంటి సినిమాలతో మళ్లీ అద్భుతమైన విజయాన్ని సాధించాడు. రేపటితో ప్రభాస్ తన 45వ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ఇక అతని పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు అభిమానులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ నటించిన కొన్నిచిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు.
భారీగా విరాళాలందించిన ప్రభాస్
ప్రభాస్‌కు భారతదేశంలోనే కాకుండా జపాన్, చైనా, మలేషియా, సింగపూర్, అమెరికా వంటి దేశాల్లో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు. 2017లో బాహుబలి విజయానంతరం మేడం టుస్సాడ్స్ బాంకాక్ మ్యూజియంలో మైనపు విగ్రహం పొందిన మొదటి దక్షిణాది నటుడిగా ప్రభాస్ నిలిచాడు. ప్రభాస్ పలు చారిటీ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నాడు. గత 20 ఏళ్లుగా ఆయన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాడు. తుఫాన్లు, వరదలు, కోవిడ్-19 వంటి విపత్తుల సమయంలో భారీగా విరాళాలు అందించాడు.
టోక్యోలో ముందుగా ప్రభాస్ జన్మదిన వేడుకలు
2020లో ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో 1,650 ఎకరాలను దత్తత తీసుకుని, దాని అభివృద్ధి కోసం రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చాడు. ఈకో పార్క్‌ను తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు పేరిట అభివృద్ధి చేయడానికి ఆర్థిక సాయాన్ని కూడా అందించాడు. ఇప్పుడు ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలను టోక్యో ప్రభాస్ అభిమానులు ముందుగానే జరుపుకున్నారు. అయితే ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు కాస్త ముందుగానే మొదలు కావడంతో ఆయన అభిమానులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు.