
Kannappa: 'కన్నప్ప' షూటింగ్ లో జాయిన్ అయ్యిన పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్'
ఈ వార్తాకథనం ఏంటి
మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమా చేస్తున్నాడు.మహాభారత్ సీరియల్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్నారు.కొన్ని రోజుల క్రితం, బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ పోర్షన్ పూర్తి అయ్యినట్లు మేకర్స్ వెల్లడించారు.
అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ తో స్వయంగా మంచు విష్ణు అప్డేట్ అందించాడు.
ఈ పోస్టర్ లో ప్రభాస్ షూట్ లో జాయిన్ అయ్యినట్లు తెలిపాడు.అయితే,ఈ పోస్టర్ లో ప్రభాస్ క్యారెక్టర్ కి సంబంధించి పాదరక్షలు, చిరుత చర్మంతో కూడిన దుస్తులు కనిపిస్తున్నాయి.
ఇది ఖచ్చితంగా ప్రభాస్ అభిమానులందరికీ శుభవార్తే.
Details
గోప్యంగా ప్రభాస్ పాత్ర
అయితే, ప్రభాస్ పాత్రకు సంబంధించిన వివరాలు ఇంకా గోప్యంగా ఉంచారు.
ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తోంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మణిశర్మ, స్టీఫెన్ దేవస్సీ స్వరాలు సమకూరుస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మంచు విష్ణు చేసిన ట్వీట్
My brother joined the shoot #Prabhas#kannappa🏹 pic.twitter.com/WW8WQbBLec
— Vishnu Manchu (@iVishnuManchu) May 9, 2024