Page Loader
Game Changer: గేమ్ ఛేంజ‌ర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి డిప్యూటీ సీఎం? 
గేమ్ ఛేంజ‌ర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి డిప్యూటీ సీఎం?

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి డిప్యూటీ సీఎం? 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2024
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, విడుదలైన పాటలు, టీజర్‌తో సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, అంజలి, నవీన్ చంద్ర, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా విడుదల తేదీపై ఆసక్తి నెలకొనగా, ఇప్పుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్ గురించి కీలక సమాచారం చర్చనీయాంశంగా మారింది.

వివరాలు 

అభిమానుల్లో మరింత హైప్ 

తాజా సమాచారం ప్రకారం,ఈ ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించాలని చిత్రబృందం భావిస్తోంది. ముఖ్యంగా కాకినాడ లేదా రాజమండ్రి వంటి పట్టణాల్లో జనవరి మొదటి వారంలో ఈ కార్యక్రమం జరుగనున్నట్లు సమాచారం. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవుతారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్‌ అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేశాయి. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. గేమ్ ఛేంజర్ ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. శ్రీమతి అనిత సమర్పణలో వస్తున్న ఈ చిత్రం,విడుదలకు ముందు అన్ని వర్గాల్లో భారీ అంచనాలను సృష్టించింది.