Page Loader
Bandla Ganesh : పవన్ కళ్యాణ్ నాకు జీవితాన్ని ఇచ్చాడు : బండ్ల గణేష్
పవన్ కళ్యాణ్ నాకు జీవితాన్ని ఇచ్చాడు : బండ్ల గణేష్

Bandla Ganesh : పవన్ కళ్యాణ్ నాకు జీవితాన్ని ఇచ్చాడు : బండ్ల గణేష్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2024
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న 'గబ్బర్ సింగ్' సినిమాని రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ గబ్బర్ సింగ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి నిర్మాత బండ్ల గణేష్ హాజరై పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్‌ను తాను ఎప్పటికీ విమర్శించనని, ఆ విధంగా కలలో కూడా ఊహించని నిర్మాత బండ్ల గణేశ్‌ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్‌ తన జీవితంలో కీలక పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు.

Details

ప్రాణం పోయినా పవన్ కళ్యాణ్ ను విమర్శించను

పవన్‌ని అభిమానించే మీరు ఒకానొక సమయంలో ఆయన్ని తక్కువ చేసి మాట్లాడారని ఓ విలేకరి బండ్ల గణేష్ ను ప్రశ్నించారు. దీనిపై బండ్ల గణేశ్‌ ఎమోషనల్‌గా స్పందించారు. ప్రాణం పోయినా కూడా పవన్‌ను విమర్శించను అని, అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలో లేనప్పుడు మరొక విధంగా మాట్లాడే వ్యక్తిని తాను కాదన్నారు. తన మనసుకు నచ్చకపోతే దేవుడినైనా ఎదిరిస్తానని, ఒకవేళ నచ్చితే కాళ్లు కూడా పట్టుకుంటానని పేర్కొన్నారు. తాను కొన్నేళ్లుగా కాంగ్రెస్‌‌లో ఉన్నానని, తాను కలలో కూడా పవన్‌ను విమర్శించను అని, పవన్ ఫోటో నా ఇంట్లో, నా బెడ్‌రూమ్‌లో ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.