LOADING...
Hari Hara Veera Mallu: హరిహరవీరమల్లుపై అదిరిపోయే వార్త చెప్పిన కబీర్‌ దుహన్ సింగ్‌ 
హరిహరవీరమల్లుపై అదిరిపోయే వార్త చెప్పిన కబీర్‌ దుహన్ సింగ్‌

Hari Hara Veera Mallu: హరిహరవీరమల్లుపై అదిరిపోయే వార్త చెప్పిన కబీర్‌ దుహన్ సింగ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2025
02:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ యాక్టర్ ప‌వన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్ నుంచి వరుసగా సినిమాలు విడుదల అవుతున్న తెలిసిందే. వీటిలో ఒకటి పవన్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). ఏపీ ఎన్నికల కారణంగా ఈ సినిమా షూటింగ్ కొంతకాలం నిలిచిపోయినా, 2024లో మరోసారి షూటింగ్ ప్రారంభమైంది. పవన్ ఒకవైపు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తన బాధ్యతలను నిర్వహిస్తూ, మరొకవైపు హరిహరవీరమల్లు సినిమా, ఇతర ప్రాజెక్టుల షూటింగ్స్‌పై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో హరిహరవీరమల్లు టీమ్ నుండి తాజా వార్త ఒకటి బయటకు వచ్చింది.

వివరాలు 

అనుపమ్ ఖేర్‌ బదులు సత్యరాజ్‌

సినిమా చివరి షెడ్యూల్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు కబీర్ దుహర్ సింగ్, చివరి షెడ్యూల్ సందర్భంగా క్యారవాన్ నుండి బయటకు వస్తున్న తన స్టిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసారు. బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనుపమ్ ఖేర్‌కు డేట్స్‌ సమస్య వల్ల ఈ సినిమాలో ఆయన స్థానంలో ప్రముఖ నటుడు సత్యరాజ్‌ను తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుంది, మొదటి భాగం "హరిహరవీరమల్లు" 2024 మార్చి 28న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

వివరాలు 

ప్రధాన పాత్రలో ఇస్మార్ట్ భామ

జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం , బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో, మేఘ సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు.