LOADING...
Hari Hara Veera Mallu: 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' ప‌బ్లిక్ టాక్.. పవన్ యాక్షన్, ఎలివేషన్‌ సీన్లు హైలైట్ అంటున్న ఫ్యాన్స్‌
పవన్ యాక్షన్, ఎలివేషన్‌ సీన్లు హైలైట్ అంటున్న ఫ్యాన్స్‌

Hari Hara Veera Mallu: 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' ప‌బ్లిక్ టాక్.. పవన్ యాక్షన్, ఎలివేషన్‌ సీన్లు హైలైట్ అంటున్న ఫ్యాన్స్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2025
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చారిత్రాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను ఎంతోకాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ఇప్పుడు థియేటర్లకు తరలివస్తున్నారు. అనేక వాయిదాల అనంతరం గత రాత్రి ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు ఘనంగా సాగుతున్నాయి. ప్రీమియర్ షోలను చూసిన ప్రేక్షకులు, అభిమానులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మరికొందరు మీడియాతో మాట్లాడుతూ సినిమా పై తమ స్పందనను వ్యక్తపరిచారు. పవన్ కళ్యాణ్‌ యాక్షన్,ఎలివేషన్ సీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అంటున్నారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి,జ్యోతికృష్ణ చారిత్రక నేపథ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారని,సినిమా మొత్తం ఎక్కడా బోర్ కొట్టలేదని వారు పేర్కొన్నారు.

వివరాలు 

కీరవాణి మ్యూజిక్‌ ఈ చిత్రానికి హైలెట్‌

సమాజానికి మంచి సందేశం అందించేలా చిత్రాన్ని రూపొందించినందుకు కూడా ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొదటి భాగమైన ఈ పార్ట్-1లో ప్రతి పాత్రను అద్భుతంగా రూపొందించినట్లు చెబుతున్నారు. ఇక పార్ట్-2లో ఈ పాత్రలకు సంబంధించి మరింత లోతైన వివరణ ఇవ్వబోతున్నారని అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ సంగీతదర్శకుడు కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచిందని ప్రేక్షకులు అభినందిస్తున్నారు. ఈ తరహా చారిత్రక పాత్రకు పవన్ కళ్యాణ్ లాంటి నటుడే సరిపోతారని, ఆయన తప్ప మరెవ్వరూ ఈ పాత్రను అంత స్థాయిలో న్యాయం చేయలేరని అభిమానులు గర్వంగా చెబుతున్నారు.