LOADING...
యాక్షన్ లోకి దిగిన పవన్ కళ్యాణ్: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు 
ఉస్తాద్ భగత్ సింగ్ నుండి రిలీజైన పోస్టర్

యాక్షన్ లోకి దిగిన పవన్ కళ్యాణ్: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు 

వ్రాసిన వారు Sriram Pranateja
Sep 07, 2023
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుండి ఇప్పటివరకు గ్లింప్స్ విడుదలైంది. ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. ఒకానొక దశలో ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాతే మొదలుకానుందని వినిపించింది. ప్రస్తుతం అలాంటి ఊహగానాలన్నింటినీ పక్కన పెట్టేస్తూ, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లోకి పవన్ కళ్యాణ్ వచ్చేసారు. యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రీకరించడానికి షూటింగ్ మొదలైపోయింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలైందని ట్వీట్ 

Advertisement