Page Loader
OG : థాయ్‌లాండ్ ఎయిర్‌పోర్ట్‌లో 'ఓజీ' షూటింగ్.. పవన్‌ కల్యాణ్ బిజీ షెడ్యూల్ 
థాయ్‌లాండ్ ఎయిర్‌పోర్ట్‌లో 'ఓజీ' షూటింగ్.. పవన్‌ కల్యాణ్ బిజీ షెడ్యూల్

OG : థాయ్‌లాండ్ ఎయిర్‌పోర్ట్‌లో 'ఓజీ' షూటింగ్.. పవన్‌ కల్యాణ్ బిజీ షెడ్యూల్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 08, 2024
05:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఓజీ' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పవన్‌ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. ఓజీ షూటింగ్ ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. చిత్రబృందం భారీ నౌక, ఎయిర్‌పోర్ట్, స్టైలిష్ కార్లు లాంటి లొకేషన్లలో షూట్‌ నిర్వహిస్తుండగా, వాటి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డిప్యూటీ సీఎంగా తన రాజకీయ బాధ్యతలను నిర్వహించడమే కాకుండా, చిత్రీకరణకు కూడా సమయాన్ని కేటాయిస్తున్నాడు.

Details

కథానాయికగా ప్రియాంకా ఆరుళ్

ఇప్పటికే విడుదలైన హంగ్రీ చీతా గ్లింప్స్ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచింది. ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా, శ్రియారెడ్డి కీలక పాత్రలో కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. పవన్ అభిమానులు ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు