
అఫీషియల్: బ్రో ట్రైలర్ కు ముహూర్తం కుదిరింది: ఎప్పుడు రిలీజ్ కానుందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం మరికొన్ని గంటల్లో రాబోతుంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతుంది.
ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా అప్డేట్ ఇచ్చింది. బ్రో సినిమా ట్రైలర్ ను జులై 22వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే ఏ సమయంలో రిలీజ్ చేస్తున్నారో మాత్రం వెల్లడి చేయలేదు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించనున్నారు. గోపాల గోపాల తర్వాత పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపిస్తున్న చిత్రం ఇదే.
తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలను త్రివిక్రమ్ అందించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బ్రో ట్రైలర్ పై అప్డేట్
The Blasting Duo @PawanKalyan & @IamSaiDharamTej will walk in to our worlds with the Most awaited Mass Celebration 🥳#BROTrailer will storm your timelines on July 22nd 📣🔥@thondankani @TheKetikaSharma @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @sujithvasudev @NavinNooli… pic.twitter.com/9IInWv3R3K
— People Media Factory (@peoplemediafcy) July 20, 2023