LOADING...
OG: పవన్ - ప్రియాంక జోడీ సర్‌ప్రైజ్.. ఓజీ రెండో పాట ఆగస్టు 27న రిలీజ్!
పవన్ - ప్రియాంక జోడీ సర్‌ప్రైజ్.. ఓజీ రెండో పాట ఆగస్టు 27న రిలీజ్!

OG: పవన్ - ప్రియాంక జోడీ సర్‌ప్రైజ్.. ఓజీ రెండో పాట ఆగస్టు 27న రిలీజ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2025
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ దూసుకెళ్తున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు ఆయన చేతిలో ఉన్న మూడు సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు విడుదల కాగా, సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ, హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ కూడా వేగంగా పూర్తి చేశారు. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ పూర్తయి, ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. అయితే వీటిలో ప్రేక్షకుల్లో అత్యధిక ఆసక్తిని రేపుతున్న చిత్రం ఓజీ. ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు.

Detils

 వినాయక చవితి సందర్భంగా రెండో పాట

వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, రొమాంటిక్ ట్రాక్, కెమిస్ట్రీ ఫ్యాన్స్‌కు ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని మూవీ టీమ్ చెబుతోంది. ఇక తాజాగా ఓజీ నుంచి రెండో పాటపై అప్‌డేట్ వచ్చింది. మెలోడీ సాంగ్‌గా రాబోయే ఈ పాటను ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. అంటే, పవన్ అభిమానులకు కేవలం కొన్ని రోజుల్లోనే ఈ ప్రత్యేక మెలోడీ అందుబాటులోకి రానుంది. అయితే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.