తదుపరి వార్తా కథనం

Pawan kalyan:OG కోసం పాట పాడనున్న పవన్ కళ్యాణ్.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన థమన్
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 17, 2024
12:45 pm
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు.చేతిలో ఉన్న సినిమాల షూటింగులు,రాజకీయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
అయితే ఓజీ సినిమా నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది.థమన్ ముఖ్య అతిథిగా వచ్చిన సూపర్ సింగర్ S2 ఎపిసోడ్‌లో,OG గురించి ఓ క్రేజీ అప్డేట్ చెప్పాడు.
ఈసినిమాలోని ఒక పాటను పవన్ కళ్యాణ్ పాడే అవకాశం ఉందని థమన్ తెలిపాడు.
అంతకముందు,పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో "కొడకా కోటేశ్వర్ రావు" పాటను పాడారు.
ప్రస్తుతం పాలిటిక్స్ లో పవన్ బిజీ గా ఉన్నారు.ఓజీ సినిమాను సాహో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్నాడు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాని 2024 చివరి నాటికి విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.