తదుపరి వార్తా కథనం
Kuberaa: 'పోయి రా మావా'.. కుబేర ఫస్ట్ సాంగ్ రిలీజ్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 20, 2025
11:39 am
ఈ వార్తాకథనం ఏంటి
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'కుబేర' (Kubera) నుండి ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది.
ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, కింగ్ నాగార్జున ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. తాజాగా సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేశారు.
'పోయి రా మావా' అంటూ సాగే ఈ పాటను హీరో ధనుష్ స్వయంగా ఆలపించడం విశేషం. ఈ పాటకు భాస్కర్ భట్ల లిరిక్స్ అందించగా, దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.
ఈ మ్యూజికల్ ట్రీట్‌తో సినిమాపై ఆసక్తి మరింతగా పెరుగుతోంది. శేఖర్ కమ్ముల స్టైల్లో వినూత్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.