పొన్నియన్ సెల్వన్ 2 సినిమా చూసేముందు తెలుసుకోవాల్సిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
మణిరత్నం రూపొందిన పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం గతేడాది విడుదలై తమిళంలో మంచి విజయం అందుకుంది. ఇతర భాషల్లో పెద్దగా ప్రభావం చూపలేదు.
ఏప్రిల్ 28వ తేదీన పొన్నియన్ సెల్వన్ 2 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం.
పొన్నియన్ సెల్వన్ లోని అరుణ్ మొళి పాత్ర కోసం మహేష్ బాబును, వల్లవరాయ వందివదేవన్ పాత్ర కోసం తలపతి విజయ్ ను తీసుకోవాలని అనుకున్నారట. కానీ కారణమేంటో గానీ కుదరలేదు.
నిజానికి 1985లో ఎంజీ రామచంద్రన్ పొన్నియన్ సెల్వన్ సినిమా తీద్దామని పుస్తకం హక్కులను తీసుకున్నారట. కానీ ఒకానొక యాక్సిడెంట్ కారణంగా అది వీలుపడలేదు. ఆ తర్వాత హక్కులను పునరుద్దరించలేదట.
Details
కమల్ హాసన్ కలల్లో పొన్నియన్ సెల్వన్
కమల్ హాసన్ కూడా పొన్నియన్ సెల్వన్ నవలను సినిమాగా మలచాలని హక్కులను కొనుక్కున్నారు. మణిరత్నం దర్శకత్వంలో చేయాలని ఆయన భావించినప్పటికీ బడ్జెట్ కారణాల వల్ల అది తెరకెక్కలేదు.
ఆ తర్వాత 2019లో మణిరత్నం, లైకా ప్రొడక్షన్ బ్యానర్ సాయంతో పొన్నియన్ సెల్వన్ సినిమాను నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు 500కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందని సమాచారం.
కల్కి క్రిష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. 1954లో ఈ నవల మార్కెట్ లోకి వచ్చింది. రాజరాజ చోళుడు సింహాసనాన్ని ఎలా అధిష్టించాడన్నది ఈ నవలలో తెలియజేసారు.
పొన్నియన్ సెల్వన్ రెండవ భాగంలో రెండు పాత్రల్లో కనిపిస్తుంది ఐశ్వర్యా రాయ్. వృద్ధురాలిగా కనిపించే పాత్ర ఆసక్తిగా ఉంటుందట.