Pooja Gandhi : భాష నేర్పించిన వ్యక్తితో దండుపాళ్యం హీరోయిన్ పెళ్లి.. వరుడు అతనే
టాలీవుడ్ సహా దక్షిణాది చిత్ర పరిశ్రమలను, క్రైమ్ థ్రిలర్ స్టోరీతో వణికించిన దండుపాళ్యం సినిమాకు మాస్ క్రేజ్ వచ్చింది. అయితే మూవీలో ప్రధాన పాత్రలో నటించిన నటీమణి పూజా గాంధీకి సంబంధించి అదిరిపోయే శుభవార్త తెలిసింది. 40 ఏళ్ల పూజా గంధీ, లాజిస్టిక్స్ కంపెనీ యజమాని విజయ్'ని బుధవారం యెలహంక(బెంగళారు)లో సాంప్రదాయంగా వివాహం చేసుకోనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ముహూర్తం సైతం ఫిక్స్ అయిందట. నవంబర్ 29న బెంగుళూరులో ఘనంగా పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. 2012లో ఓ వ్యాపారవేత్తతో పూజా గాంధీకి నిశ్చితార్థం జరిగింది. అయితే ఎంగేజ్మెంట్ జరిగిన కొద్దికాలానికే బ్రేకప్ చెప్పేసింది ఈ నటీ. గతంలోనూ ఓ డిస్ట్రిబ్యూటర్'ని పెళ్లి చేసుకున్నారని ప్రచారం జరిగింది.
2001 నుంచి సినిమాల్లో కొనసాగుతున్న పూజా గాంధీ
తాజాగా తనకి భాష నేర్పించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటోందని శాండల్ వుడ్'లో వార్తలు వస్తున్నాయి. దండుపాళ్యం ఫేమస్ : దండూపాళ్యం మొదటి పార్ట్ సూపర్ హిట్ అయ్యింది. దీంట్లో మూడు సిరీస్'లు వచ్చాయి.అన్నీ సూపర్ టాక్' సొంతం చేసుకున్నాయి. దండుపాళ్యం సినిమాల్లో పూజా గాంధీ బోల్డ్'గా నటించింది. ఈ మేరకు మంచి క్రేజ్'ను సొంతం చేసుకుంది. అంతకు ముందూ పలు చిత్రాల్లో నటించింది. అందులో విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. అయినప్పటికీ దండుపాళ్యంతోనే టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్'లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అనంతరం సినిమాల నుంచి కాస్త విరామం తీసుకున్నారు. 2001 నుంచి చిత్రపరిశ్రమలో పూజా కొనసాగుతున్నారు.