కాలి గాయాలతో ఇబ్బందిపడుతున్న పూజా హెగ్డే: ఆందోళనలో అభిమానులు
కొన్ని రోజుల వరకు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన పూజా హెగ్డే, ప్రస్తుతం విజయాలు లేక ఇబ్బంది పడుతోంది. రీసెంట్ గా ఆమె నటించిన ఆచార్య, రాధే శ్యామ్, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. ప్రస్తుతం హిందీ సినిమాల్లో బిజీగా ఉన్న పూజా హెగ్డే, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది. తాజాగా తన కాలికి గాయమైందని పూజా హెగ్డే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రెండు మోకాళ్ళకు గాయమైనట్లు పూజా హెగ్డే తెలియజేస్తూ, గాయాల తాలూకు ఫోటోలను కూడా పోస్ట్ చేసింది.
బాక్సింగ్ లో తగిలిన గాయాలు
రెండు మోకాళ్లు కమిలిపోయినట్టుగా ఎర్రగా మారిపోయాయి. అయితే ఆ గాయాలకు కారణాన్ని కూడా పూజా హెగ్డే తెలియజేసింది. గత కొన్ని రోజులుగా పూజా హెగ్డే బాక్సింగ్ నేర్చుకుంటుంది. అలా నేర్చుకుంటున్నప్పుడే రెండు మోకాళ్ళకు గాయమైనట్లు ఆమె తెలియజేసింది. అయితే పూజా హెగ్డే బాక్సింగ్ ఎందుకు నేర్చుకుంటుందనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఏదైనా సినిమా కోసమా లేదా లేక మరేదైనా ప్రత్యేకమైన అవసరం కోసమా అనేది తెలియాల్సి ఉంది. తన కాలికి గాయమైందన్న విషయాన్ని పూజా హెగ్డే తెలియజేయగానే అభిమానులు ఆందోళన చెందారు. అదలా ఉంచితే ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి.