LOADING...
Akhanda 2: అఖండ 2 టీజర్‌కు అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్.. బాలయ్యతో ఫోన్ కాల్ వైరల్!

Akhanda 2: అఖండ 2 టీజర్‌కు అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్.. బాలయ్యతో ఫోన్ కాల్ వైరల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 11, 2025
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అఖండ 2 - తాండవం'. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ సక్సెస్‌ఫుల్ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సంబంధించిన టీజర్‌ను బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ టీజర్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వెల్లువెత్తింది. విడుదలైన 24 గంటల వ్యవధిలోనే యూట్యూబ్‌లో 24 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో టాప్‌లో నిలిచింది. "నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడు కూడా కన్నెత్తి చూడడు.. నువ్వు చూస్తావా.. అమాయకుల ప్రాణాలు తీస్తావా అనే బాలకృష్ణ డైలాగ్ సినిమా అంచనాలను అమాంతం పెంచేసింది.

Details

అభిమాని ఫోన్ కాల్ వైరల్

బోయపాటి మార్క్ టేకింగ్‌, బాలకృష్ణ మాస్ యాక్షన్‌, విశేషమైన విజువల్స్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి టీజర్‌పై వస్తున్న స్పందన చూసి నందమూరి బాలకృష్ణ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో అనంతపురానికి చెందిన అభిమాని జగన్, నేరుగా బాలకృష్ణకు ఫోన్ చేసి తన భావోద్వేగాన్ని పంచుకున్నాడు. ఆ కాల్ రికార్డింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది అరాచకం అన్నా. ఆల్ ఇండియాలో మీ లుక్‌ను కొట్టేవాడు లేడు. 'దాన వీర శూర కర్ణ'లో అన్న ఎన్టీఆర్ లుక్ మాదిరిగా ఉంది. చరిత్ర ఉన్నంత వరకు ఈ లుక్ గుర్తుండిపోతుందని అభిమాని అన్నారు. దీనిపై స్పందించిన బాలకృష్ణ 'డౌట్ ఏముంది' అంటూ ఆత్మవిశ్వాసం చాటారు.

Details

సెప్టెంబర్ 25న రిలీజ్

అభిమానులు మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా టీజర్‌ను పదే పదే చూస్తున్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, కళామతల్లి దీవెనలు, అభిమానుల ప్రేమ వల్లే తాను ఈ తరహా శక్తివంతమైన పాత్రలు పోషించగలుగుతున్నానని బాలకృష్ణ వినయంగా పేర్కొన్నారు. ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన వివరాల ప్రకారం 'అఖండ 2 - తాండవం' చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది.