శ్రీలీల పోస్టర్ల పర్వం: ఏడు సినిమాల నుండి రిలీజైన ఏడు పోస్టర్లు
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరని ఎవ్వరినడిగినా శ్రీలీల పేరే చెబుతారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజనుకు పైగా సినిమాల్లో శ్రీలీల నటిస్తోంది. ఈరోజు శ్రీలీల బర్త్ డే, ఈ సందర్భంగా ఆమె నటించిన సినిమాల నుండి వరుసగా పొస్టర్లు రిలీజ్ అయ్యాయి. ఇప్పటివరకు ఏడు పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. వాటి విశేషలేంటో చూద్దాం. కారం రంగు చీరలో ఘాటుగా: గుంటూరు కారం సినిమా నుండి రిలీజైన పోస్టర్ లో శ్రీలీల చాలా అందంగా కనిపించింది. సినిమా పేరుకు తగినట్టుగానే కారం రంగు చీరను ధరించి ఘాటు ఎక్కిస్తోంది.
బాలయ్య కూతురుగా హోమ్లీగా శ్రీలీల
చిలిపిదనం ఉట్టిపడేలా: బోయపాటి, రామ్ పోతినేని కాంబోలో రూపొందుతున్న సినిమా నుండి రిలీజైన పోస్టర్ లో ఛమ్కీల డ్రెస్సు ధరించి చిలిపిగా నవ్వుతూ కనిపించింది శ్రీలీల. చిన్నబొట్టుతో హోమ్లీగా: బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి నుండి రిలీజైన పోస్టర్ లో నల్ల చుడీదార్, చిన్నబొట్టుతో హోమ్లీగా కనిపించింది. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల కనిపిస్తుంది. అల్ట్రా పోష్ లుక్ లో: నితిన్ కెరీర్ లో తెరకెక్కుతున్న 32వ సినిమా నుండి రిలీజైన పోస్టర్ లో శ్రీలీల అల్ట్రా పోష్ గా కనిపించింది. పింక్ కలర్ డ్రెస్ లో కుర్రకారు మతులు పోగొడుతోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ నుండి రిలీజైన ఇంట్రెస్టింగ్ పోస్టర్
బుంగమూతి పెట్టుకుంటూ: పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సినిమా నుండి రిలీజైన పోస్టర్ లో బుంగమూతి పెట్టుకుంటూ కనిపించింది శ్రీలీల. ఈ పోస్టర్ లో శ్రీలీల చాలా క్యూటుగా ఉంది. మాస్ లుక్ లో: ఆహా వదిలిన పోస్టర్ లో అల్లు అర్జున్ చంకనెక్కి మాస్ లుక్ లో శ్రీలీల అదరగొట్టింది. ఆహా యాడ్ ఫిలిమ్ కు సంబంధించిన పోస్టర్ అయ్యుంటుందని సమాచారం. చీరలో మెరిసిపోతూ: పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఆదికేశవ సినిమాలో పసుపు రంగు చీరలో మెరిసిపోతున్న శ్రీలీల పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమా నుండి శ్రీలీల మీద చిన్నపాటి వీడియో గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు.