
Prabhas : గ్రేట్.. వయనాడ్ బాధితులకు ప్రభాస్ రూ.2 కోట్ల విరాళం
ఈ వార్తాకథనం ఏంటి
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 360 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్తు ప్రపంచాన్ని కుదిపేసింది.
ఈ విపత్తు బాధితులకు అండగా నిలిచేందుకు ఇప్పటికే సినీ పరిశ్రమలోని పలువురు స్టార్స్ విరాళాలను ప్రకటించారు.
తాజాగా వాయనాడ్ విపత్తు బాధితుల కోసం రెబెల్ స్టార్ ప్రభాస్ పెద్ద మనుసును చాటుకున్నాడు.
వారికి అండగా నిలిచేందుకు రూ.2 కోట్ల విరాళాన్ని ఇచ్చినట్లు ఆయన టీమ్ ప్రకటించింది.
Details
కేేరళకు అండగా నిలుస్తున్న సినీ స్టార్స్
ఇప్పటికే అల్లు అర్జున్ రూ.25 లక్షలు, చిరంజీవి, రామ్ చరణ్ కలిపి రూ. కోటీ విరాళంగా ప్రకటించారు.
ఇక దక్షిణాది నుంచి సూర్య, జ్యోతిక, ఫహద్ ఫాజిల్, రష్మిక, నాయనతారలు వంటి కూడా కేరళకు అండగా నిలిచారు.
టాలీవుడ్ నుంచి ఇప్పటివరకూ బన్నీ, చిరంజీవి, రాంచరణ్, ప్రభాస్ మాత్రమే విరాళాలు ఇచ్చారు.
మిగిలిన యాక్టర్స్ కూడా విరాళాలు ప్రకటిస్తే బాగుంటుందని నెటిజన్స్ చెబుతున్నారు.