
Salaar: విషాదం.. ఫ్లెక్సీ కడుతూ ప్రభాస్ అభిమాని మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'సలార్'(Salaar) చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. దీంతో థియేటర్స్ వద్ద అభిమానుల సందడి కన్పిస్తోంది.
అయితే ఈ సందరడిలో ఒక అపశ్రుతి చోటు చేసుకుంది. రిలీజ్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఒక అభిమాని కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సలార్ సినిమా విడుదల సందర్భంగా రంగా సినీ కాంప్లెక్స్ ఎదుట ఓ ఇంటిపై సలార్ ఫ్లెక్సీ కడుతుండగా బాలరాజు(27) అనే అభిమాని కరెంట్ షాక్‌తో మృతి చెందాడు.
Details
మరో యువకుడికి గాయాలు
అనంతపురం జిల్లా తపోవనానికి చెందిన బాలరాజు చిన్న వ్యాపారం చేస్తూ కొంతకాలంగా కనగానల్లి మండలం, మామిళ్ళపల్లిలో నివాసం ఉంటున్నాడు.
సలార్ సినిమా కోసం తన స్నేహితులతో కలిసి ఫ్లెక్సీ తయారు చేయించాడు.
స్వయంగా వారే ఫ్లెక్సీ కడుతుండగా ఫ్రేమ్‌కు ఉన్న ఇనుప చువ్వ ఇంటిపై ఉన్న కరెంట్ తీగలకు తాకడంతో బాలరాజు అక్కడిక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనలో గజేంద్ర అనే యువకుడికి గాయాలు కాగా, ఈ ప్రమాదం నుంచి మరో నలుగురు యువకులు బయటపడ్డారు.
విద్యుత్ తీగలు కిందకు వేలాడుతుండటం వల్లే ప్రమాదం జరిగిందని బాలరాజు బంధువులు ఆరోపించారు.
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.