Page Loader
Prabhas: ప్ర‌భాస్ అభిమానులకి గుడ్ న్యూస్‌.. 'క‌న్న‌ప్ప' నుంచి ఫ‌స్ట్ లుక్‌ అప్‌డేట్ 
ప్ర‌భాస్ అభిమానులకి గుడ్ న్యూస్‌.. 'క‌న్న‌ప్ప' నుంచి ఫ‌స్ట్ లుక్‌ అప్‌డేట్

Prabhas: ప్ర‌భాస్ అభిమానులకి గుడ్ న్యూస్‌.. 'క‌న్న‌ప్ప' నుంచి ఫ‌స్ట్ లుక్‌ అప్‌డేట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2025
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "కన్నప్ప". మంచు కుటుంబం నుండి వచ్చిన ఈ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో మంచు విష్ణు కధానాయకుడిగా నటిస్తున్నారు. దాదాపు ₹100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా, చిత్రం యూనిట్ ఒక కీలక అప్‌డేట్‌ని ప్రకటించింది. ఫిబ్రవరి 3న ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. కొత్త పోస్టర్‌ను ఈ సందర్భంగా పంచుకున్నారు.

వివరాలు 

చిత్రంలో బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర నటులు

హిస్టారికల్, మైథాలజికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర నటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే, ఈ చిత్రం నుంచి మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, ఇతర ప్రముఖ నటుల ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్