Page Loader
Kalki Event :రేపే కల్కి 2898 AD ఈవెంట్.. ఎక్కడో తెలుసా.. ?
Kalki Event :రేపే కల్కి 2898 AD ఈవెంట్.. ఎక్కడో తెలుసా.. ?

Kalki Event :రేపే కల్కి 2898 AD ఈవెంట్.. ఎక్కడో తెలుసా.. ?

వ్రాసిన వారు Stalin
May 21, 2024
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ 'కల్కి 2898 AD'. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈసినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కిలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్,బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే కల్కి సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్,పోస్టర్స్, స్క్రాచ్ వీడియోలతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల కల్కి సినిమా నుంచి ప్రభాస్ బుజ్జి వీడియో రిలీజ్చేసిన సంగతి తెలిసిందే. అసలు కల్కి సినిమాలో బుజ్జి ఎవరో మే 22న చెప్తామని తెలిపింది మూవీ యూనిట్.

Details 

రామోజీ ఫిలిం సిటీ ఈవెంట్ లో బుజ్జి,భైరవ రోల్స్ రివీల్

తాజాగా దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన చేశారు.హైదరబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో మే 22న(బుధవారం) సాయంత్రం 5:00 గంటలకు జరిగే ఈవెంట్ లో బుజ్జి , భైరవ రోల్స్ ను రివీల్ చేయనున్నారు. ఇందుకోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్