NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Prabhas Birthday : 'యంగ్ రెబల్ స్టార్ టు గ్లోబల్ స్టార్‌'గా ఎదిగిన ప్రభాస్ ప్రస్థానమిదే!
    తదుపరి వార్తా కథనం
    Prabhas Birthday : 'యంగ్ రెబల్ స్టార్ టు గ్లోబల్ స్టార్‌'గా ఎదిగిన ప్రభాస్ ప్రస్థానమిదే!
    'యంగ్ రెబల్ స్టార్ టు గ్లోబల్ స్టార్‌'గా ఎదిగిన ప్రభాస్ ప్రస్థానమిదే!

    Prabhas Birthday : 'యంగ్ రెబల్ స్టార్ టు గ్లోబల్ స్టార్‌'గా ఎదిగిన ప్రభాస్ ప్రస్థానమిదే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 23, 2023
    10:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా గురించి చెప్పనక్కర్లేదు. ఈ పేరు తెలియని వాళ్లు భారతదేశంలో లేరంటే అతిశయోక్తి కాదు.

    ఈశ్వర్ సినిమాతో తెలుగు ఇండ్రస్టీలోకి అడుగుపెట్టిన ప్రభాస్, ఆ తర్వాత రాఘవేంద్ర, వర్షం, అడవిరాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఎక్‌నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి వంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లో నటించాడు.

    తర్వాత బహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు.

    నేడు డార్లింగ్ కు 44ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఆయన సినిమాల గురించి తెలుసుకుందాం..

    బాహుబలి తరువాత రెండేళ్ల గ్యాప్ తర్వాత సాహో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు.

    Details

    కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో కనిపించనున్న ప్రభాస్

    ఇక ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ శ్రీరామచంద్రుడిగా కనిపించాడు. ఆ సినిమా కూడా ప్లాప్ కావడంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు.

    సినిమాలు పెద్దగా ఆడకపోయినా ఆయనకు ఉన్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు.

    ప్రభాస్ కెరియర్ తొలినాళ్లలో కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కగా, ప్రస్తుతం ఆయన రేంజ్ 1500 కోట్లకు చేరుకుంది.

    మంచు విష్ణు హీరోగా వస్తున్న కన్నప్ప మూవీలో ప్రభాస్ శివుడు పాత్రలో కనిపించనున్నాడు. దీనికి సంబంధించిన అధికారక ప్రకటన కూడా మంచి విష్ణు ఇచ్చేశాడు.

    పురాణా, సాంఘీక, జానపద, ఫిక్షన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ పాత్రలోనైనా ప్రభాస్ అద్భుత నటనతో ఆకట్టుకుంటున్నాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

    Details

    ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ

    నిర్మాతగా ఉన్న తండ్రి సూర్య నారాయణ రాజు, హీరోగా చేసిన పెద్దనాన్న కృష్ణం రాజు తర్వాత వారసుడిగా 'ఈశ్వర్' సినిమాతో ప్రభాస్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు.

    21 ఏళ్ల పాటు ఇండ్రస్టీలో కష్టపడి రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ స్థాయిని దాటి అంతర్జాతీయ అభిమానులని గెలుచుకున్నాడు.

    ప్రస్తుతం ప్రభాస్ సినిమా కోసం టాలీవుడ్, బాలీవుడ్‌లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు

    Details

    సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విషెస్

    వరుస సినిమాలతో ప్రభాస్ బీజీ

    ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతోంది. డిసెంబర్ 22వ తేదీని పార్ట్1 రిలీజ్ కానుంది.

    ఇక నాగ్అశ్విన్ దర్శకత్వంలో Kalki 2898 ఏడీ అనే సినిమా చేస్తున్నాడు. మరోవైపు తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ అదిరిపోయే న్యూస్ చెప్పాడు. ఆయన తర్వాతి సినిమా కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయనున్నట్లు తెలుస్తోంది.

    ఇది కాక అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో, దర్శకుడు మారుతితో కూడా ప్రభాస్ సినిమాలను తీయబోతున్నాడు.

    ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సినీ స్టార్స్ తో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభాస్
    సినిమా

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ప్రభాస్

    'సలార్' మూవీపై ఆసక్తికర అప్టేట్ ఇచ్చిన జగపతి బాబు  సలార్
    ప్రాజెక్ట్ కె నుండి దీపికా పదుకొణె లుక్ రిలీజ్: అభిమానులు నిరాశ చెందారా?  ప్రాజెక్ట్ కె
    ప్రాజెక్ట్ కె: అమెరికాలో ప్రభాస్ అభిమానుల కార్ ర్యాలీ; కార్లతో ప్రాజెక్ట్ కె లోగో  ప్రాజెక్ట్ కె
    అమెరికా వీధుల్లో కమల్ హాసన్: ప్రాజెక్ట్ కె కోసం హాలీవుడ్ చేరుకుంటున్న నటులు  ప్రాజెక్ట్ కె

    సినిమా

    అమెరికాలో లియో మూవీ రికార్డు: రిలీజ్ కు ముందే ఆ ఘనత సాధించిన మూవీ  అమెరికా
    నితిన్ ఎక్స్ ట్రా సినిమాలో రాజశేఖర్: ఇంతకీ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారో తెలుసా?  నితిన్
    సలార్ వర్సెస్ డంకీ: రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు రావడంపై పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్  సలార్
    Happy Birthday Keerthy Suresh: నటనతో పాటు వయొలిన్ వాయించడంలో ప్రావీణ్యం ఉన్న కీర్తి సురేష్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు  కీర్తి సురేష్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025