Page Loader
సలార్ టీజర్ రిలీజ్ కు ముహుర్తం ఖరారు.. తెల్లవారు 5.12 గంటలకు విడుదల చేయడం పై జోరుగా చర్చ
తెల్లవారు 5.12 గంటలకు విడుదల చేయడం పై జోరుగా చర్చ

సలార్ టీజర్ రిలీజ్ కు ముహుర్తం ఖరారు.. తెల్లవారు 5.12 గంటలకు విడుదల చేయడం పై జోరుగా చర్చ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 04, 2023
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

సలార్ టీజర్ రిలీజ్ కు ముహుర్తం ఖరారైంది. ఈనెల 6న ప్రభాస్ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. ఈ మేరకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెల్లడించారు. అయితే టీజర్ ను ఉదయం 5:12 గంటలకు విడుదల చేయడంపై పెద్ద చర్చే జరుగుతోంది. సలార్ టీజర్ విడుదల సమయం,కేజీఎఫ్ 2 క్లైమాక్స్‌కు లింకు ఉందంటూ జోరుగా చర్చలు సాగుతున్నాయి. కేజీఎఫ్ 2 క్లైమాక్స్ కి సంబంధించి షిప్ లోని గడియారానికి సంబంధించిన ఓ ఫొటో వైరల్ అయింది. రాకీపై తెల్లవారు సమయంలోనే దాడి జరిగి నీటిలో పడిపోతాడని నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. కేజీఎఫ్ 2 క్లైమాక్స్ దగ్గరే సలార్ కథ స్టార్ట్ అని, అందువల్లే టీజర్‌ను ఉదయం రిలీజ్ చేస్తున్నారని భావిస్తున్నారు.

DETAILS 

కేజీఎఫ్ 2 క్లైమాక్స్ సీన్ తో సలార్ టీజర్ రిలీజ్ సమయాన్ని లింక్ చేస్తూ నెట్టింట జోరుగా చర్చ

కేజీఎఫ్2 క్లైమాక్స్ సీన్ తో టీజర్ రిలీజ్ సమయాన్ని లింక్ చేయడాన్ని కొంతమంది నెటిజన్లు అంగీకరిస్తున్నారు. మరికొందరు తోసిపుచ్చుతున్నారు. ఆయా ప్రశ్నలపై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నుంచి స్పందన వస్తుందేమోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు సలార్ సినిమాపై ఇప్పటికే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా పోస్టర్లు మాత్రమే రిలీజ్ అయ్యాయి. తాజాగా టీజర్ విడుదల చేస్తూ సినీ ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు చిత్ర బృందం రెఢీ అయిపోయింది. తెలుగు, త‌మిళం, హిందీతో పాటు పలు భార‌తీయ భాష‌ల్లోనూ సెప్టెంబ‌ర్ 28న సినిమా రిలీజ్ కానుంది. ప్రభాస సరసన శృతిహాసన్ ఆడి పాడనుంది. స‌లార్ సినిమాలో మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్రను పోషిస్తున్నారు.