Page Loader
Spirit: 'స్పిరిట్‌' సినిమా విడుదల తేదీపై నిర్మాత భూషణ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు 
'స్పిరిట్‌' సినిమా విడుదల తేదీపై నిర్మాత భూషణ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు

Spirit: 'స్పిరిట్‌' సినిమా విడుదల తేదీపై నిర్మాత భూషణ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 14, 2024
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

'కల్కి 2898 AD' చిత్రంతో ప్రభాస్‌ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సాధించారు. ప్రస్తుతం ఆయన 'రాజా సాబ్‌', 'ఫౌజీ' చిత్రాలను చేస్తున్నారు. తరువాత, ప్రముఖ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించే 'స్పిరిట్‌' చిత్రంలో ప్రబాస్‌ నటించనున్నారు. 'యానిమల్‌' వంటి సంచలన చిత్రం తరువాత సందీప్‌ వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన డ్యూయల్‌ రోల్‌లో నటిస్తారని, అలాగే రణబీర్‌ కపూర్‌, విజయ్‌ దేవరకొండ అతిథి పాత్రలలో నటిస్తారని వార్తలు చక్కర్లు కొడుతోంది.

వివరాలు 

 వచ్చే దసరాకి 'స్పిరిట్‌'

ఇదిలావుండగా, తాజా ఇంటర్వ్యూలో 'స్పిరిట్‌' చిత్ర నిర్మాతల్లో ఒకరైన భూషణ్‌ కుమార్‌ ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. డిసెంబర్‌ చివర్లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందని, ఆరు నెలల్లో షూటింగ్‌ పూర్తి చేసి సినిమాను విడుదల చేసే ఉద్దేశ్యంతో ఉన్నామని పేర్కొన్నారు. దీంతో, 'స్పిరిట్‌' చిత్రం వచ్చే దసరాకి ప్రేక్షకుల ముందుకు రాబోతోందని అభిమానులు అంచనా వేస్తున్నారు. 'స్పిరిట్‌' ఒక కమర్షియల్‌ చిత్రం కావడంతో, షూటింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల కోసం కూడా ఎక్కువ సమయం అవసరం కాకపోవచ్చని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.