సలార్ టీజర్: జురాసిక్ పార్కులో డైనోసార్ గా ప్రభాస్ ఎలివేషన్; అభిమానులకు పూనకాలే
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా టీజర్ విడుదలైంది.
టీజర్ లో ప్రభాస్ అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి. కేజీఎఫ్ దర్శకుడి నుండి ఏవైతే ఎక్స్ పెక్ట్ చేసారో అవన్నీ టీజర్ లో కనిపించాయి.
టీజర్ మొదట్లో, విలన్లు గన్నులు పట్టుకుని టీనూ ఆనంద్ దగ్గరకి వెళ్తారు. అక్కడ టీనూ ఆనంద్ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
అడవిలో పులి, చిరుత, ఏనుగు చాలా ప్రమాదకరం. కానీ జురాసిక్ పార్కులో కాదు, ఎందుకంటే అక్కడ డైనోసార్ ఉంటుందనీ, ఆ డైనోసార్ ప్రభాస్ క్యారెక్టర్ అని మాస్ ఎలివేషన్ ఇచ్చారు ప్రశాంత్ నీల్.
Details
కేజీఎఫ్ మార్క్ ఎలివేషన్లతో నిండిపోయిన సలార్ టీజర్
పూర్తి టీజర్ లో ప్రభాస్ ముఖాన్ని ఎక్కడా రివీల్ చేయలేదు. కానీ ఎలివేషన్స్ తోనే హైప్ తెప్పించారు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ మాదిరి ఎలివేషన్లతో సలార్ సినిమా నిండిపోయిందని టీజర్ తెలియజేస్తుంది.
సలార్ లో విలన్ గా కనిపిస్తున్న మళయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ ని కూడా చూపించారు. హీరో, విలన్ ఎంట్రీలు వెరే లెవెల్లో ఉన్నాయి.
రెండు భాగాలుగా సలార్:
ముందు నుంచీ ప్రచారంలో ఉన్నట్టు సలార్ సినిమా రెండు భాగాలుగా వస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించేసారు. మొదటి భాగాన్ని సలార్- సీజ్ ఫైర్ అని చెప్పుకొచ్చారు.
శృతిహాసన్ హీరోయిన్ గా కనిపిస్తున్న సలార్ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నారు.